యాదగిరిగుట్ట ఆలయంలో కరోనా కలకలం... అర్చకులు సహా 68 మందికి కరోనా!

  • ప్రత్యేక పరీక్షా శిబిరం ఏర్పాటు
  • ఆందోళన చెందుతున్న గుట్ట వాసులు
  • ఆలయంలో లఘు దర్శనాలు మాత్రమే
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరి గుట్టలో కరోనా కలకలం రేగింది. దేవాలయంలోని అర్చకులు సహా మొత్తం 68 మంది ఉద్యోగులు, సిబ్బందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. దీంతో గుట్ట వాసులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు, ప్రత్యేక కరోనా వైరస్ పరీక్షా శిబిరాన్ని ఏర్పాటు చేశారు.

ఎటువంటి కరోనా లక్షణాలు కనిపించినా, వెంటనే నమూనాలు ఇచ్చి పరీక్షలు చేయించుకోవాలని అధికారులు సూచించారు. ఈ ఘటన తరువాత ఆలయంలో నిత్యాన్నదానాన్ని నిలిపివేశారు. భక్తుల సమక్షంలో స్వామివారికి జరిగే ఆర్జిత సేవలను రద్దు చేసి, లఘు దర్శనాలను మాత్రమే అమలు చేస్తున్నామని ఆలయ  అధికారులు వెల్లడించారు.

Yadagiri Gutta
Yadadri Bhuvanagiri District
Corona Virus
Preists

More Telugu News